Chandrababu: మహిళల ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయి: బోండా ఉమ

షార్ట్స్‌లో చూడండి
ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. తమ కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. రాత్రి అయినా మహిళలు క్యూలైన్లలో నిలుచున్నారంటే... తమకు మేలు చేసిన ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికేనని అన్నారు. వైయస్ పాలన ఎలాంటిదో ప్రజలు చూశారని... చంద్రన్న పాలన ఏంటో ఈ ఐదేళ్లలో చూశారని చెప్పారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా మహిళలకు అందాయని... అందుకే తమ భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టేందుకు భారీ సంఖ్యలో మహిళలు పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
Bonda Uma
Telugudesam

More Telugu News