మేం అందంగా కనిపించం కాబట్టే మీడియా మమ్మల్ని చూపించదు: కుమారస్వామి
- మోదీ రోజూ మేకప్ వేసుకుని, వ్యాక్సింగ్ చేయించుకుంటారు
- ప్రతిపక్ష నేతలు అందంగా ఉండరు కాబట్టే మీడియా పట్టించుకోవడం లేదు
- కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలి
ఈ సందర్భంగా మోదీపై కుమారస్వామి విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం మానేసి మోదీ ముఖం చూసి ఓటెయ్యాలని కోరుతున్నారని ఎద్దేవా చేశారు. కన్నడిగులకు మోదీ ఏం చేశారో చెప్పాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. విమర్శలు చేసేవాళ్లను స్వేచ్ఛగా చేసుకోనివ్వాలని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్-జేడీఎస్ మధ్య ఇకపైనా పొత్తు కొనసాగుతుందని కుమారస్వామి స్పష్టం చేశారు.