భవిష్యత్తులో జగన్‌పై కేసులు నిరూపణ అయితే ఏంటి పరిస్థితి?: సినీ నటుడు శివాజీ
- అమరావతిపై వైఖరిని ఎందుకు స్పష్టం చేయట్లేదు?
- కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తాననడం హాస్యాస్పదం
- ఏపీకి రావలిసిన ఆస్తులను రాయించుకు రావాలి
ఏపీ ప్రయోజనాలు ఏమాత్రం సహించని కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తాననడం హాస్యాస్పదమన్నారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావల్సిన ఆస్తులను కేసీఆర్ నుంచి రాయించుకు రావాలని జగన్‌ను శివాజీ కోరారు. అలాగే పోలవరానికి అడ్డుపడబోనని, కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను హరించబోనని కూడా రాయించుకురావాలని సూచించారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఏపీకి ప్రత్యక హోదా ఇస్తామంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్‌తో కలిసి హోదా సాధిస్తానంటే ఎలా నమ్మాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.