Rahul Gandhi: వాయనాడ్ లో విచిత్రం!... ఎన్నికల బరిలో రాహుల్ గాంధీ వర్సెస్ రాహుల్ గాంధీ!

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షడు రాహుల్ గాంధీ ఈసారి ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కేరళలో ముస్లిం లీగ్ తో పొత్తు కుదుర్చుకున్న రాహుల్ వాయనాడ్ లో తనకు మైనారిటీ ఓట్లు బాగా పడతాయని భావిస్తున్నారు. అయితే, ఇక్కడ రాహుల్ గాంధీకి ప్రత్యర్థిగా ఉన్న అభ్యర్థి పేరు కూడా రాహుల్ గాంధీయే కావడం విచిత్రం. అగిల ఇండియా మక్కల్ కళగమ్ పార్టీకి చెందిన కేఈ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధినేతపై పోటీచేస్తున్నారు.

ఈ కేఈ రాహుల్ గాంధీకి ఓ సోదరుడు ఉన్నాడు. అతడి పేరు రాజీవ్ గాంధీ. ఆ రాజీవ్ గాంధీకి ఓ కుమార్తె ఉండగా, ఆమె పేరు ఇందిరా గాంధీ కావడం మరో విచిత్రం. ఏదేమైనా హస్తం గుర్తు తప్ప పేర్లన్నీ గాంధీల కుటుంబానికి దగ్గరగా ఉండడంతో ఓటర్లు అయోమయానికి గురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ విచిత్రమైన పరిస్థితిని కాంగ్రెస్ చీఫ్ ఎలా ఎదుర్కొంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Rahul Gandhi
Congress
Kerala

More Telugu News