Balakrishna: మతిస్థిమితం కోల్పోయిన బాలకృష్ణను చంద్రబాబు కంట్రోల్ చేయాలి: జీవీఎల్ డిమాండ్

షార్ట్స్‌లో చూడండి
బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అధికార టీడీపీపై విమర్శలు గుప్పించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణ మతిస్థిమితం కోల్పోయాడని, ఇక ఆయన్ను నియంత్రించాల్సిన బాధ్యత చంద్రబాబుదేనని అన్నారు.

బాలయ్యకు పిచ్చి మరింత ముదిరినట్టు అర్థమవుతోందని, ఆయన ఇటీవల సొంత పార్టీ కార్యకర్తలపైనా, మీడియాపైనా విరుచుకుపడుతున్నారని, బండబూతులు తిడుతున్నారని అన్నారు. బాలకృష్ణ ఇంతకుముందే తనకు పిచ్చి అంటూ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారని జీవీఎల్ ఆరోపించారు. అంతేకాకుండా, సోదాలు నిర్వహించడం పట్ల టీడీపీ రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఐటీ అధికారులు, ఇతర విభాగాలు వారి పని వారు చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు.
Go Back to Shorts
Balakrishna
Telugudesam
BJP

More Telugu News