కొడాలి నానిపై సాధినేని యామిని ఫైర్
- అసెంబ్లీలో ఏనాడైనా ప్రజాసమస్యలను ప్రస్తావించారా?
- కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు
- అవినాశ్ ఘన విజయం సాధించడం ఖాయం
నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తానేంటో నిరూపించుకోవాల్సింది పోయి... అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారంటూ నానిపై యామిని మండిపడ్డారు. రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్న చంద్రబాబును విమర్శించడం ఆయన కుసంస్కారానికి నిదర్శనమని చెప్పారు. కులాల మధ్య చిచ్చురేపుతున్నారని మండిపడ్డారు. బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని అవినాశ్ తనతో చెప్పారని అన్నారు.