ప్రధాని మోదీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం!
- ద్వైపాక్షిక సంబంధాల కృషికి ప్రకటించిన యూఏఈ
- ఇరుదేశాల సంబంధాల పటిష్టత కోసం చేసిన కృషికి గుర్తింపు
- గతంలో ఇదే అవార్డును అందుకున్న పుతిన్, సర్కోజీ, మెర్కల్
ఈ అత్యున్నత పురస్కారాన్ని గతంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2, రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్.డబ్ల్యూ. బుష్, ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ, జర్మనీ ఛాన్స్ లర్ ఏంజెలా మెర్కల్ తదితరులు మాత్రమే అందుకున్నారు. తాజాగా వీరి సరసన ప్రధాని మోదీ చేరారు.