భార్య వివాహేతర సంబంధం.. చిన్నారులకు ఉరివేసి ఆత్మహత్య చేసుకున్న భర్త
- హాయిగా సాగుతున్న సంసారంలో చిచ్చుపెట్టిన భార్య
- వదిలి వెళ్లిన భార్యను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం
- మానసిక క్షోభకు గురై ఆత్మహత్య
పిల్లలు ఇద్దరినీ చున్నీతో ఉరివేసి చంపి ఆ ఫొటోలను భార్యకు వాట్సాప్ చేశాడు. అనంతరం ఇంటి పైకప్పుకు తాను కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలను చూసిన భార్య వెంటనే పోలీసులకు, తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అలాగే, ఇంటిపైనే ఉంటున్న రుషికాంత్ సోదరుడికి కూడా ఫోన్ చేసి విషయం చెప్పింది. అయితే, వారొచ్చేసరికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.