బీహార్ బీజేపీ నేత ఇంటిని డైనమైట్లతో పేల్చివేసిన నక్సల్స్!

  • లోక్ సభ ఎన్నికలను బహిష్కరించండి
  • లేఖను వదిలి వెళ్లిన నక్సలైట్లు
  • బీహార్ మాజీ ఎమ్మెల్సీ ఇంటి పేల్చివేత
ఈ లోక్ సభ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ, బీజేపీకి చెందిన ఓ నేత ఇంటిని డైనమైట్లతో పేల్చేశారు నక్సలైట్లు. బీహార్ లోని దుమారియాలో గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్సీ అనుజ్ కుమార్  అనే పార్టీ నేత ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది.

ఇంటిని పేల్చివేసేముందు ఇంట్లోని వారందరినీ బయటకు పంపేయడంతో ప్రాణనష్టం ఏమీ సంభవించలేదు. వెళ్లిపోయే ముందు నక్సలైట్లు అక్కడ ఓ లేఖను వదిలి వెళ్లారు. సార్వత్రిక ఎన్నికలను ప్రతి ఒక్కరూ బాయ్ కాట్ చేయాలని పిలుపునిచ్చారు. నక్సలైట్లు వెళ్లిపోయిన తరువాత ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు, కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కాగా, గయ పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుమారియా ప్రాంతంలో నక్సలైట్లు నిత్యమూ ఏదో ఒక రూపంలో పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.
Go Back to Shorts
BJP
Lok Sabha
Naxals
Blast

More Telugu News