Tollywood: ‘జనసేన’కే నా మద్దతు.. రాజకీయాల్లోకి తారక్ రాక కోసం ఎదురుచూస్తున్నా: హీరో మంచు మనోజ్

షార్ట్స్‌లో చూడండి
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించని అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మంచు మనోజ్ ఏపీ ప్రజలకు ఓ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ విషయమై ట్విట్టర్ వేదికగా చర్చ సాగుతోంది. ఇదే తరుణంలో, రాజకీయానికి సంబంధించిన ప్రశ్నలూ మంచు మనోజ్ పై నెటిజన్లు సంధించారు. ఓ నెటిజన్ వ్యాఖ్యలకు మంచు మనోజ్ స్పందిస్తూ, తప్పకుండా, తన మద్దతు ఎల్లప్పుడూ జనసేన పార్టీకే ఉంటుందని పేర్కొన్నాడు.

‘ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారన్నది నీ ఇష్టం. కానీ, ఐదు లేదా పది సంవత్సరాల తర్వాత తారక్ అన్న(జూనియర్ ఎన్టీఆర్) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే..’ అని మరో నెటిజన్ అడిగాడు. ‘తారక్ వస్తే ఇంకా నేను ఎటు వెళ్తాను తమ్ముడూ?! నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు’ అని మనోజ్ సమాధానమివ్వడం గమనార్హం.
Go Back to Shorts
Tollywood
Janasena
Pawan Kalyan
Manchu Manoj

More Telugu News