శత్రుఘ్న సిన్హాకు షాక్ ఇచ్చిన బీజేపీ
- లోక్ సభ ఎన్నికల్లో టికెట్ నిరాకరణ
- సిన్హా స్థానంలో రవి శంకర్ ప్రసాద్ కు టికెట్ కేటాయింపు
- గత రెండేళ్లుగా మోదీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సిన్హా
పాట్నాసాహిబ్ నియోజకవర్గం నుంచి సిన్హా రెండు సార్లు వరుసగా గెలుపొందారు. గత రెండేళ్లుగా విపక్షాలతో కలసి బీజేపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ, రైతు సమస్యలు, నిరుద్యోగం, రాఫెల్ డీల్ తదితర అంశాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోల్ కతా, ఢిల్లీలలో విపక్షాలు నిర్వహించిన మెగా ర్యాలీల్లో సైతం సిన్హా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో, ఆయనపై బీజేపీ అధిష్ఠానం కొరడా ఝుళిపించింది.