మోహన్‌బాబు వల్లే దాసరి మనవడు రోడ్డున పడ్డాడు: దాసరి కోడలు సుశీల ఆగ్రహం
- దాసరి పోగానే ఆస్తులు పంచుతానన్నారు
- మొసలి కన్నీరు కారుస్తున్నారు
- దాసరి గురువంటూనే మోసం చేశారు
దాసరి తన గురువంటూనే తమను మోసం చేశారని సుశీల మోహన్‌బాబుపై మండిపడ్డారు. దాసరి చనిపోగానే తమందరికీ ఆస్తులు పంచుతానని చెప్పి, నేటికీ పంచలేదని ఆరోపించారు. మోహన్‌బాబు కారణంగా దాసరి మనవడు రోడ్డున పడ్డాడని విమర్శించారు. దాసరి కుటుంబానికే న్యాయం చేయని మోహన్‌బాబు, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్‌పై మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ సుశీల విమర్శించారు.