ఇక ప్రచారానికి వెళ్లండి... పది మందికి ఓకే చెప్పేసిన కేసీఆర్!
- ఆదిలాబాద్ కు గోడం నగేశ్, కరీంనగర్ కు బీ వినోద్
- మల్కాజిగిరికి నవీన్ రావు పేరు ఖరారు
- మరో ఆరు నియోజకవర్గాలపై కేసీఆర్ కసరత్తు
ఇదే సమయంలో భువనగిరి నుంచి బూర నర్సయ్యగౌడ్, వరంగల్ నుంచి పసునూరి దయాకర్, చేవెళ్లకు జి.రంజిత్ రెడ్డి, మల్కాజిగిరికి కె.నవీన్ రావు, నాగర్ కర్నూల్ కు పి.రాములు పేర్లనూ కేసీఆర్ ఖరారు చేశారు. మిగిలిన మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్ స్థానాల విషయంలో టీఆర్ఎస్ అధినేత ఇంకా ఓ స్పష్టతకు రాలేదని సమాచారం.