వివేకా హత్య ఎఫెక్ట్: నేటి జగన్ ఎన్నికల ప్రచారం రద్దు
- ప్రస్తుతం పులివెందులలోనే జగన్
- రేపటి నుంచి నాలుగు రోజులపాటు ప్రచారం
- పిడుగురాళ్ల నుంచి ప్రారంభించనున్న వైసీపీ చీఫ్
రేపటి (ఆదివారం) నుంచి జగన్ వరుసగా నాలుగు రోజులపాటు ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నట్టు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు. ఆదివారం విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న జగన్ 18న పాణ్యం నియోజకవర్గంలో, 19న పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో, 20న నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం నిర్వహిస్తారు.