ys viveka: వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు

షార్ట్స్‌లో చూడండి
వైయస్ వివేకానందరెడ్డి మృతిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించాయని తెలిపారు. మృతి వెనుక ఎవరి పాత్ర ఉన్నట్టు తెలిసినా... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Go Back to Shorts
ys viveka
sit
death

More Telugu News