Form-7: ప్రజలు సిద్ధంగా ఉండాలి... జగన్ రోజుకో విచిత్రం చూపిస్తారు: చంద్రబాబునాయుడు

షార్ట్స్‌లో చూడండి
ఫారమ్ - 7ను దుర్వినియోగం చేశానని స్వయంగా ఒప్పుకుని అడ్డంగా దొరికిపోయిన వైఎస్ జగన్, ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం చేశారంటూ సరికొత్త నాటకాన్ని ప్రారంభించారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఇక ఆయన రోజుకో విచిత్ర వేషం వేస్తారని, వాటిని చూసేందుకు ప్రజలు, వాటిని భరిస్తూ తిప్పి కొట్టేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తాను తాజాగా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిపై సర్వే చేయించానని, టీడీపీ ఘన విజయం సాధించనుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాలతో లాభం పొందిన ప్రజలే ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా ప్రచారం చేయనున్నారని అన్నారు. వైసీపీకి లబ్దిని కలిగించేందుకు తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో ధన ప్రవాహం మొదలైందని, దీన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, హెలికాఫ్టర్ గుర్తును చూసి జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
Go Back to Shorts
Form-7
Chandrababu
Jagan
Vote

More Telugu News