Chandrababu: కేసీఆర్‌ నోరు ఎలా మూయించాలో నాకు తెలుసు: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నోరు ఎలా మూయించాలో తనకు తెలుసునని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో  మళ్లీ గెలిచేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారు. ఈరోజు పార్టీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలా అని తాను ఆలోచిస్తుంటే వారు కుట్రల్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు. మనం ఓటర్లతో మమేకం అవుతుంటే, వారంతా ఓట్లు తొలగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుట్రలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు. మూడు పార్టీల కుతంత్రాలకు ఈ ఎన్నికలు సమాధానం కావాలని చెప్పారు. ఎన్నికలకు అత్యంత తక్కువ సమయం ఉన్నందున ఓటర్లకు ఎలా దగ్గర కావాలో దిశానిర్దేశం చేశారు.
Go Back to Shorts
Chandrababu
KCR
teliconference

More Telugu News