Andhra Pradesh: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా చేయమని కేసీఆర్ ను జగన్ ఒప్పించాలి: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేలా చేయమని కేసీఆర్ ను జగన్ ఒప్పించాలని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీకి  ‘హోదా’ ఇవ్వాలంటూ కేసీఆర్ ను కేంద్రానికి లేఖ రాయమని జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మళ్లీ ఆంధ్రా వాళ్ల పాలన కావాలా? అని కేసీఆర్ అడిగారని, మరి, ఇప్పుడు తాను కూడా ప్రశ్నిస్తున్నానని, ఏపీలో తెలంగాణ వాళ్ల పాలన కావాలా? అని ధ్వజమెత్తారు. ‘మీకు చంద్రబాబు కావాలా? కేసీఆర్ కావాలా? టీఆర్ఎస్ కు ఊడిగం చేసే జగన్ కు ఓటేయాలా?’ అని ప్రశ్నించారు.

ఈ ఎన్నికలు  ప్రజల ఆత్మగౌరవానికి సబంధించినవి

రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వారికి, యువత భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని అన్నారు. చదువుకున్న పిల్లలు, యువత విజ్ఞతతో ఆలోచించాలని, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ భరోసా ఇస్తుందో, దానికి అండగా ఉండాలని, ఈ ఎన్నికలు  ప్రజల ఆత్మగౌరవానికి సబంధించిన విషయమని అన్నారు.  
Go Back to Shorts
Andhra Pradesh
Telangana
kcr
Chandrababu
Telugudesam
TRS
YSRCP
jagan

More Telugu News