తెలంగాణ ఉద్యోగినులకు నేడు సెలవు.. టీఆర్ఎస్ సర్కారు ఉమెన్స్ డే కానుక!
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఉద్యోగినులకు సీఎల్ మంజూరు చేసిన ప్రభుత్వం
- ఆర్టీసీలోని మహిళా ఉద్యోగులకు సీ-ఆఫ్
ఇక టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు, ఉద్యోగినులకు సీ-ఆఫ్ (కాంపెన్సేటరీ ఆఫ్)ను ప్రకటిస్తున్నట్టు సంస్థ ఎండీ పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. స్పెషల్ ఆఫ్ వర్తించేవారికి కూడా సీ-ఆఫ్ వర్తింపజేస్తామని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, పురుషులతో సమానంగా ఆర్టీసీలోనూ దూసుకెళ్లాలని ఈ సందర్భంగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, సునీల్ శర్మ కోరారు.