మార్చి 5ను నా జీవితంలో మరచిపోలేను: సినీ నటుడు తనీష్
- నాకున్న ఒకే ఒక్క స్ఫూర్తి
- 16 సంవత్సరాల తరువాత కలిశాను
- జీవితానికి సరిపోయే దీవెనలిచ్చారు
‘‘నాకున్న ఒకే ఒక్క స్ఫూర్తి. ఆయన(చిరంజీవి) పాటలు చూస్తూ డ్యాన్స్ స్టెప్స్ నేర్చుకునేవాడిని. 16 సంవత్సరాల తరువాత కలిశాను. ఈ రోజును ఎప్పటికీ మరచిపోలేను. ‘మా’ ఎన్నికల్లో దీవెనల కోసం వెళ్లాను. జీవితానికి సరిపోయే దీవెనలు ఇచ్చారు. ఈ ఫీలింగ్ అద్భుతంగా అనిపిస్తోంది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి. మీకు ధన్యవాదాలు సార్. నేను మీకు ఎప్పటికీ ఏకలవ్య శిష్యుణ్ణే. 5 మార్చి, 2019 తేదీని ఎప్పటికీ మరచిపోలేను’’ అని తనీష్ పేర్కొన్నాడు.