విరాట్ కోహ్లీతో డేటింగ్-బ్రేకప్ వ్యవహారం.. తొలిసారి స్పందించిన హీరోయిన్ తమన్నా!
- 2012లో ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న విరాట్, తమన్నా
- డేటింగ్ లో ఉన్నట్లు, అనంతరం విడిపోయినట్లు వార్తలు
- ఈ వ్యవహారంపై క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ
తాను విరాట్ కోహ్లీతో యాడ్ షూటింగ్ లో నటిస్తున్నప్పుడు కనీసం నాలుగు మాటలు కూడా మాట్లాడలేదని తమన్నా చెప్పింది. ‘2012లో ఓ యాడ్ కోసం మేమిద్దరం పనిచేశాం. ఆ తర్వాత విరాట్ ను నేను కలవలేదు. కనీసం మాట్లాడలేదు. కానీ నేను పనిచేసిన హీరోలతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎన్నో రెట్లు నయం’ అని కితాబిచ్చింది. ఇక తాను అమెరికాకు చెందిన ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకోబోతున్నానని వస్తున్న వార్తలను సైతం తమన్నా ఖండించింది.