మరోసారి భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన పాక్ యుద్ధ విమానాలు
- కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్థాన్
- పూంచ్ సెక్టార్ లో భారత గగనతలంలోకి వచ్చిన పాక్ విమానాలు
- మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాక్
ఈ ఉదయం పూంచ్ సెక్టార్ లో పాక్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. కాల్పులకు తెగబడింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో కూడా ఇండియన్ పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులు జరిపారు. ఇదే సమయంలో పాక్ విమానాలు మన గగనతలంలోకి చొచ్చుకువచ్చాయి.