అమ్మాయిల దుస్తులను మించిన ఎన్నో సమస్యలున్నాయి: రష్మీ గౌతమ్
Add ap7am to your home Screen

అమ్మాయిల దుస్తులను మించిన ఎన్నో సమస్యలున్నాయి: రష్మీ గౌతమ్

  • నాగబాబు వ్యాఖ్యలకు మద్దతు పలికిన రష్మి
  • అతిగా స్పందించిన ఓ నెటిజన్
  • ట్విట్టర్ వేదికగా రష్మీ గౌతమ్ ఆగ్రహం
అమ్మాయిలు ధరించే దుస్తులపై నటుడు నాగబాబు చేసిన వ్యాఖ్యలకు మద్దతిస్తూ, నటి, యాంకర్ రష్మీ గౌతమ్ మాట్లాడిన మాటలు వైరల్ కాగా, పలువురు ఆమె వైఖరిని తప్పు పడుతూ ఉంటే, ఓ నెటిజన్ ఇంకాస్త అతిగా స్పందించడంతో, ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఓ నెటిజన్ రష్మీని ఉద్దేశించి, డ్రస్ సెన్స్ గురించి మీరు మాట్లాడటం ఏంటని, భారతీయ సంస్కృతి నుంచి పుట్టిన వీటి గురించి మీ లాంటి వారికి తెలియదని, నాగబాబు తన కుమార్తెను బికినీలో 'ఎక్స్ ట్రా జబర్దస్త్' కార్యక్రమానికి తీసుకువస్తారా? అని కామెంట్ పెట్టాడు.

దీనిపై తీవ్రంగా స్పందించిన రష్మి, "ఈ చెత్త మెంటాలిటీ మారకుంటే, మనం ఎప్పటికీ ఎదగలేం. అమ్మాయిలు వేసుకునే దుస్తులను మించి చర్చించుకోవడానికి, స్పందించడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మీ ఇంట్లో అమ్మాయిలకు అండగా ఉండండి. మీ శక్తిని అందుకు ఉపయోగించండి. మహిళలు తీసుకునే నిర్ణయాలే మిమ్మల్ని మరింత ఉన్నతవంతులను చేస్తాయి" అని వ్యాఖ్యానించింది.



Rashmi Goutam
Twitter
Nagababu

More Telugu News