మోదీ.. మీరు మరోసారి ప్రధాని కావాలనేది నా కోరిక: సోనియా పక్కన ఉండగానే బాంబు పేల్చిన ములాయం
- మోదీ ఎన్నో మంచి పనులు చేశారు
- ఆయనను ఎవరూ వేలెత్తి చూపలేరు
- లోక్ సభలో ములాయం సంచలన వ్యాఖ్యలు
మోదీ ఎన్నో మంచి పనులు చేశారని... ఆయన వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని తెలిపారు. ఈ సమయంలో సోనియాగాంధీ పక్క సీటులోనే ఆయన ఉండటం గమనార్హం. అయితే, ములాయం వ్యాఖ్యలకు ఆమె చిరునవ్వు నవ్వారు. మరోవైపు ములాయం వ్యాఖ్యలతో మోదీ ఉబ్బితబ్బిబ్బు అయ్యారు. తన రెండు చేతులను కలిపి ఊపుతూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ములాయం కుమారుడు, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. యూపీలో బీజేపీని ఎదుర్కొనేందుకు తమ వైరిపక్షం బీఎస్పీతో కూడా చేతులు కలిపారు. ఇలాంటి నేపథ్యంలో, ములాయం చేసిన వ్యాఖ్యలు ఢిల్లీ రాజకీయాల్లో వేడిని మరింత పెంచనున్నాయి.