అలాంటి దుస్తులు ఎందుకు వేసుకోవాలి? హీరోయిన్ల అంగాంగ ప్రదర్శనపై ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఫైర్
- ఎటువంటి దుస్తులు ధరించాలనేది వారికి తెలియడం లేదు
- సినిమా ఫంక్షన్లకు అలాగేనా వచ్చేది
- నా వ్యాఖ్యలు వారికి అర్థం కావనుకుంటున్నా
తన వ్యాఖ్యలపై హీరోయిన్లు మండిపడినా తన అభిప్రాయం మాత్రం ఇదేనని బాలు తేల్చి చెప్పారు. అయినా, చాలామంది హీరోయిన్లకు తెలుగు రాదని, కాబట్టి తానేమన్నాననే విషయం వారికి అర్థం కాకపోవచ్చని అన్నారు. తన వ్యాఖ్యలపై హీరోయిన్లు ఎలా స్పందిస్తారన్న విషయంతో తానేమీ భయపడడం లేదన్నారు.