‘యాత్ర’ సినిమాలో సన్నిలియోన్.. వైరల్ గా మారిన ఫొటో.. వివరణ ఇచ్చిన మమ్ముట్టి ఫ్యాన్స్!

  • ఒకే ఫ్రేమ్ లో సన్నిలియోన్-మమ్ముట్టి
  • ప్రచారాన్ని ఖండించిన మమ్ముట్టి అభిమానులు
  • అది మరో సినిమాకు చెందిన ఫొటో అని స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీవితంపై ‘యాత్ర’ పేరుతో సినిమాను మహీ వి రాఘవ్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు. అయితే అచ్చం వైఎస్ వేషధారణలో ఉన్న మమ్ముట్టితో శృంగార తార సన్నీ లియోన్ ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ‘యాత్ర’ సినిమాలో సన్నీ నటిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మమ్ముట్టి అభిమానులు స్పందించారు. మమ్ముట్టి హీరోగా ‘మధురరాజా’ అనే సినిమా తెరకెక్కుతోందని తెలిపారు. అందులో సన్నిలియోన్ కూడా నటిస్తోందన్నారు. ఈ ఫొటో యాత్ర సినిమాకు సంబంధించినది కాదని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు ఈ ఫొటో యాత్ర సినిమాలోనిది అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ, వాటిని పట్టించుకోవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
Tollywood
ysr
yatra
Social Media
viral photo
Sunny Leone
mammutti
photo
fans

More Telugu News