Chandrababu: ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: సినీ నటి దివ్యవాణి
ప్రముఖ సినీ నటి దివ్యవాణి ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. రానున్న ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈ వార్తలపై దివ్యవాణి స్పందించారు. ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. మాటలు చెప్పేందుకు చాలా పార్టీలు ఉన్నాయని... కానీ, పని చేసే ఏకైక పార్టీ టీడీపీనే అని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే మళ్లీ చంద్రబాబుకే పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.