కంగనా రనౌత్ ముందు యాక్షన్ హీరోలు కూడా హీరోయిన్లుగా కనిపిస్తున్నారు!: వర్మ ప్రశంసలు
- నిన్న విడుదలైన మణికర్ణిక సినిమా
- ఝాన్సీ రాణి లక్ష్మీబాయి జీవితంపై చిత్రీకరణ
- ట్విట్టర్ లో ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో ఈరోజు వర్మ స్పందిస్తూ..‘మణికర్ణికలో కంగనా రనౌత్ అనే గొప్ప హీరోను చూశాక యాక్షన్ హీరోలందరూ నాకు హీరోయిన్లుగా కనిపిస్తున్నారు’ అని ట్వీట్ చేశారు. వర్మ ప్రస్తుతం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ రాజకీయ, వ్యక్తిగత జీవితంపై ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.