కర్నూలు అసెంబ్లీ సీటు నాదే.. చంద్రబాబుపై పూర్తి నమ్మకం ఉంది!: ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి
- సర్వేలు నాకు అనుకూలంగా ఉన్నాయి
- పార్టీ కార్యక్రమాల్లో కీలకంగా ఉన్నాను
- రాబోయే ఎన్నికల్లో టీడీపీదే విజయం
పార్టీ అధినేత చంద్రబాబు చేపట్టిన సర్వేల్లో తనకే ఎక్కువ అనుకూలత ఉన్నట్లు తేలిందని మోహన్ రెడ్డి అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రికి కూడా తెలుసన్నారు. కర్నూలు నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలన్నీ తన ఆధ్వర్యంలోనే సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమనీ, సీఎం చంద్రబాబు అందరికీ న్యాయం చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కర్నూలు స్థానంపై టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్ గంపెడాశలు పెట్టుకున్నారు.