‘జనసేన’లో చేరిన ఆకుల సత్యనారాయణ.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్
- ‘జనసేన’లో చేరిన ఆకుల దంపతులు
- ఆకుల కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉంది
- ఈ చేరికతో ‘జనసేన’ మరింత బలోపేతమైంది

ఆకుల కుటుంబం పార్టీకి అండగా ఉండి ప్రోత్సహిస్తుంది: పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లాలో ఆకుల సత్యనారాయణ కుటుంబానికి ప్రత్యేక గౌరవం ఉందని, అలాంటి కుటుంబం ‘జనసేన’లో చేరడం వల్ల పార్టీ మరింత బలోపేతమైందని సంతోషం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల సమయంలో పొత్తులో భాగంగా ఆకుల సత్యనారాయణకు తాను మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆకుల కుటుంబం జనసేన పార్టీకి అండగా ఉండి ప్రోత్సహిస్తుందని ఆకాంక్షించారు. ఆకుల దంపతులను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని అన్నారు.