ఆశ్చర్యపరుస్తోన్న 'ఎఫ్ 2' తొలివారం వసూళ్లు
- అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
- నైజామ్ ఏరియా వసూళ్లు 11.80 కోట్లు
- ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో తొలివారంలో ఈ సినిమా 35.05 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 43 కోట్ల షేర్ ను రాబట్టింది. తొలివారంలో ఈ సినిమా ఒక్క నైజామ్ లోనే 11.80 కోట్లను వసూలు చేయడం విశేషం. ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో, అనిల్ రావిపూడి తన పారితోషికాన్ని పెంచేశాడనీ .. ఆయనతో సినిమాలు చేయడానికి యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.