'మజ్ను' దర్శకుడితో నందమూరి హీరో
- కల్యాణ్ రామ్ తాజా చిత్రంగా '118'
- తదుపరి సినిమా విరించి వర్మతో
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, మరో దర్శకుడికి కల్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు .. ఆ దర్శకుడి పేరే విరించి వర్మ. ప్రేమకథలను తెరకెక్కించడంలో విరించి వర్మకి మంచి పట్టుంది. 'ఉయ్యాలా .. జంపాలా' .. 'మజ్ను' సినిమాలు ఆ విషయాన్ని నిరూపిస్తాయి. అలాంటి విరించి వర్మ .. కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఈ సారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను వేసవిలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.