బ్రహ్మానందానికి గుండెపోటు... ముంబయ్ ఆసుపత్రిలో బైపాస్ సర్జరీ!

  • 1000కి పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం
  • సోమవారం నాడు సర్జరీ 
  • ముంబైలోని ఏహెచ్ఐలో చికిత్స
దాదాపు 1000కి పైగా చిత్రాల్లో నటించిన ప్రముఖ కమేడియన్ కన్నెగంటి బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ముంబైలోని ఆసియన్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు తరలించారు. ఆపై పలు పరీక్షలు చేసిన ప్రముఖ హార్ట్ సర్జన్ రమాకాంత పాండా, ఆయనకు బైపాస్ చేయాలని నిర్ణయించారు.

దీంతో సోమవారం నాడు (జనవరి 14) ఆయనకు బైపాస్ సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బ్రహ్మానందం వయసు ప్రస్తుతం 62 సంవత్సరాలుకాగా, ఆపరేషన్ సమయంలో ఆయన కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్ధ్ లు అక్కడే ఉన్నారు. బ్రహ్మానందంకు గుండెపోటు వచ్చిందని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
Go Back to Shorts
Brahmanandam
Heart Attack
Bypass
Heart Surgery

More Telugu News