అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చి మోదీ సిక్సర్ కొట్టారు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే
Add ap7am to your home Screen

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చి మోదీ సిక్సర్ కొట్టారు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

  • యూపీలో ఎస్పీ, బీఎస్పీలు జట్టు కట్టాయి
  • ఆర్పీఐ మాత్రం బీజేపీతోనే కలిసి వెళుతుంది
  • బీజేపీ ఎస్సీ వ్యతిరేక పార్టీ అనడం సబబు కాదు
ఈబీసీలకు పది శాతం రిజర్వేషన్ల బిల్లుకు సంబంధించి రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ అథవాలే తన దైన శైలిలో మాట్లాడుతూ సభ్యులను కడుపుబ్బ నవ్వించారు. కవితాత్మక ధోరణిలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చి మోదీ సిక్సర్ కొట్టారని ప్రశంసించారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీలు జట్టు కట్టాయని, ఆర్పీఐ మాత్రం బీజేపీతోనే కలిసి వెళుతుందని స్పష్టం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి బీజేపీ మద్దతుతో మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అటువంటి మాయావతి, బీజేపీ ఎస్సీ వ్యతిరేక పార్టీ అని చెప్పడం సమంజసం కాదని విమర్శించారు.
RPI
Ram das Athewale
modi
bjp

More Telugu News