‘కథానాయకుడు’ ఎంతటి చరిత్ర సృష్టిస్తుందో చెప్పలేను: పరుచూరి గోపాలకృష్ణ
- ఎన్టీఆర్ రూపంలో బాలయ్య మరో చరిత్ర సృష్టించారు
- ఆ మహానుభావుడి ఆర్ద్రతతోనే నా కళ్లు చెమ్మగిల్లాయి
- ఎన్టీఆర్ ని చూడని వాళ్లకు ఆయన్ని చూపించిన ఘనత బాలయ్యదే
చిత్రం ద్వారా ఇవాళ ఆ మహాపురుషుడి చరిత్రను అద్భుతంగా ఆవిష్కరించారని అన్నారు. ఆ మహానుభావుడిని చూస్తుంటే ఆర్ద్రతతో తన కళ్లు చెమ్మగిల్లాయని, ఈ చిత్రం ద్వారా బాలయ్య గొప్ప చరిత్రను సృష్టించాడని ప్రశంసించారు. ఈ చిత్రంలో తనకు బాలయ్య కనిపించలేదని, ఎన్టీఆర్ ని చూస్తున్నట్టే ఉందని అన్నారు. ఎన్టీఆర్ ని ఎరుగని వాళ్లకు ఎన్టీఆర్ ని చూపించిన ఘనత బాలయ్యకే దక్కుతుందని, బసవతారకం పాత్రను అద్భుతంగా ఆవిష్కరించారని కొనియాడారు.