ఒకే గర్భాన జన్మించకపోయినా.. మేమిద్దరం అన్నదమ్ములు అని ఎన్టీఆర్ చెప్పారు: మోహన్ బాబు

  • ఎన్టీఆర్ నాకు అన్నయ్య
  • ఆయన బయోపిక్ తీయడం మామూలు విషయం కాదు
  • ఎన్టీఆర్ పాత్రను బాలయ్య పోషించడం అద్భుతం, అమోఘం
ఎన్టీఆర్ బయోపిక్ తొలి భాగమైన 'కథానాయకుడు' ఈరోజు విడులైంది. సినిమా అద్భుతంగా ఉందనే టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో, దివంగత ఎన్టీఆర్ ను ప్రముఖ నటుడు మోహన్ బాబు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ చిత్రం గురించి, బాలకృష్ణ గురించి ట్విట్టర్ ద్వారా ప్రశంసలు కురిపించారు.

"నందమూరి తారక రామారావు గారు.. నాకు అన్నయ్య. ఏక గర్భములో జన్మించకపోయినా... మేమిద్దరం అన్నదమ్ములు అని చెప్పిన మహానుభావుడు ఆయన. ఆయన బయోపిక్ ని తెలుగులో తీయడమనేది మామూలు విషయం కాదు. అందులోనూ మహానటుడైన తండ్రి చేసిన పాత్రలను ఆయన కుమారుడు బాలయ్య పోషించడం అనేది కూడా మామూలు విషయం కాదు.

అయినా ఒక మంచి దర్శకుడి చేతిలో పడి, ఆ సినిమా నిర్మించబడింది. ఇందులో బాలయ్య యాక్ట్ చేశాడంటే.. ఇదొక అద్భుతం, అమోఘం. ఆడియో ఫంక్షన్ కు నన్ను పిలిచారు... నేను వెళ్ళాను. కొన్ని క్లిప్పింగ్స్ చూస్తే మళ్ళీ అన్నయ్య పుట్టాడా? అని అనిపించే విధంగా కొన్ని కొన్ని సీన్స్ ఉన్నాయి. అంటే బాలయ్య కొన్ని యాంగిల్స్ లో తన తండ్రి పోలికలను కలిగిఉండడం అనేది కూడా ఒక అద్భుతం. ఈ సినిమా అత్యద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని నమ్ముతూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను." అని ట్వీట్ చేశారు.  
Go Back to Shorts
ntr
biopic
mohan babu
balakrishna
kathanayakudu
tollywood

More Telugu News