సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Add ap7am to your home Screen

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • జాన్వీకి సోషల్ మీడియా ఇబ్బంది 
  • బన్నీ కొత్త సినిమా అప్ డేట్
  • 'ఇస్మార్ట్ శంకర్'కి మణిశర్మ సంగీతం 
*  సోషల్ మీడియా వల్ల తాను చాలా ఇబ్బంది పడుతున్నానని అంటోంది శ్రీదేవి కూతురు, హీరోయిన్ జాన్వి. "సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు నా లైఫ్ స్టయిల్ గురించి ప్రతి రోజూ రకరకాలుగా కామెంట్స్ చేస్తుంటారు. ఇవి చదివినప్పుడు నాకు చాలా బాధగా ఉంటోంది. ఇలా సోషల్ మీడియా వల్ల ప్రతి రోజూ నేను ఇబ్బంది పడుతున్నాను" అంటూ వాపోయింది జాన్వి.    
*  అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందే చిత్రం షూటింగ్ ఈ నెలలోనే లాంఛనంగా మొదలవుతుంది. ఇక రెగ్యులర్ షూటింగును ఫిబ్రవరి రెండో వారం నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.
*  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' పేరుతో ఓ చిత్రం రూపొందుతోంది. దీనికి సంగీత దర్శకుడిగా మణిశర్మను తీసుకున్నారు. త్వరలో షూటింగును ప్రారంభించి, మే నెలలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు.
Jahnvi Kapoor
Allu Arjun
Trivikram
Ram

More Telugu News