‘మై రాం-బో’ అంటూ ఉపాసన ట్వీట్!
- ‘వినయ విధేయ రామ’ సెట్ లో వీడియో పోస్ట్
- మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో
- కనల్ కన్నన్ ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయి
ఈ చిత్రంలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం సిద్ధమవుతున్న రామ్ చరణ్ ఈ వీడియోలో కనిపించాడు. కష్టమైన యాక్షన్ సీక్వెన్స్ కు ముందు మై రాం-బో వర్కవుట్ చేశాడని, అప్పుడు, అక్కడి వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పటికీ ఆయన ఒంటిపై చొక్కా లేదని తెలిపారు. ‘మిస్టర్ సి.. నువ్వు నిజమైన హీరో’ అని తన భర్తను ఉపాసన ప్రశంసలతో ముంచెత్తింది. చరణ్ కు కంపెనీ ఇచ్చిన కనల్ కన్నన్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని, ఆయన ఫైట్స్ అద్భుతంగా ఉన్నాయని తన ట్వీట్ లో ఉపాసన కొనియాడారు.