సర్వే సత్యనారాయణ ఓ వీధి రౌడీలా వ్యవహరించారు: టీ-పీసీసీ నేత బొల్లు కిషన్
- సర్వే నా చొక్కా చింపేశారు
- ఉత్తమ్, కుంతియాలపై అసభ్యకరంగా మాట్లాడారు
- తనపై దాడి ఘటనపై స్పందించిన బొల్లు కిషన్
కాగా, సర్వే సత్యనారాయణకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చి, పదవులు ఇచ్చిన నేతల పట్ల ఆయన వ్యవహరించిన తీరుపై అధిష్ఠానం సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణా కమిటీ ఆయనపై బహిష్కరణ వేటు వేసింది.
ఇదిలా ఉండగా, యూపీఏ హయాంలో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా సర్వే సత్యనారాయణ పని చేశారు. 2014లో మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా ఆయన పోటీచేసి ఓడిపోయారు. 2015 లో వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేసి ఆయన ఓటమిపాలయ్యారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన సర్వే ఓటమి పాలయ్యారు.