ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ!: యాంకర్ అనసూయ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ!: యాంకర్ అనసూయ

  • రంగమ్మత్త పాత్ర మంచి పేరు తెచ్చింది
  • నటన .. గ్లామర్ రెండూ ఉండాలి 
  • వెంకటేశ్ గారితో నటించాలనే ముచ్చట తీరింది  
ఇటు బుల్లితెరపైనా .. అటు వెండితెరపైన అనసూయ తన సత్తా చాటుతోంది. క్రితం ఏడాది 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త'గా ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాత్ర ఆమె క్రేజ్ ను మరింతగా పెంచేసింది. అలాంటి అనసూయ తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. "మీరు టీవీ ఛానల్ ను .. సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేస్తున్నట్టుగా విన్నాము .. వాటిని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు?" అనే ప్రశ్న ఒక అభిమాని నుంచి అనసూయకి ఎదురైంది.

అందుకు అనసూయ స్పందిస్తూ .."ఈ రూమర్ ఎక్కడి నుంచి వచ్చిందండీ బాబూ" అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఇక ఇతర అభిమానుల ప్రశ్నలకి సమాధానంగా .. 'నా కెరియర్లో 'రంగమ్మత్త' పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ సినిమాలో నా పాత్రకి వచ్చిన ప్రశంసలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చాయి. నటనకు .. గ్లామర్ కి ప్రాధాన్యత గల పాత్రలనే అంగీకరిస్తాను. వెంకటేశ్ గారితో కలిసి నటించాలనే కోరిక 'ఎఫ్ 2' సినిమాతో తీరింది. ట్విట్టర్లో రోజుకి 20 నుంచి 25 మందిని బ్లాక్ చేస్తుంటాను" అని అనసూయ చెప్పడం కొసమెరుపు. 
anasuya

More Telugu News