సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైన రామ్ .. పూరి
Add ap7am to your home Screen

సర్ ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమైన రామ్ .. పూరి

  • హిట్ కోసం రామ్ వెయిటింగ్ 
  • పూరి కథకి గ్రీన్ సిగ్నల్ 
  • త్వరలోనే సెట్స్ పైకి    
కొంతకాలంగా సరైన హిట్ లేక హీరో రామ్ సతమతమవుతున్నాడు. 'హలో గురు ప్రేమ కోసమే' కూడా నిరాశపరచడంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ ఆయన కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఇక పూరి జగన్నాథ్ కూడా హిట్ అనే మాట విని చాలా కాలమే అయింది. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఇద్దరూ వున్నారు.

ఇటీవల రామ్ కి పూరి కథ వినిపించడం .. ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకి చార్మీ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలోనే రేపు సాయంత్రం 4 గంటలకు ఒక సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్టుగా చార్మీ ట్వీట్ చేసింది. ఆ సర్ ప్రైజ్ ఏమిటనేది ఇటు రామ్ అభిమానుల్లోను .. అటు పూరి అభిమానుల్లోను ఆసక్తిని రేకెత్తించడం ఖాయం. ఇది రామ్ కి 17వ సినిమా కాగా, పూరి జగన్నాధ్ కి 35వ సినిమా కావడం విశేషం. 
ram
puri

More Telugu News