బాలీవుడ్ నటుడు ఖాదర్ ఖాన్ కన్నుమూత.. కెనడాలోనే అంత్యక్రియలు!
- కాబూల్ లో జన్మించిన ఖాదర్ ఖాన్
- గత కొంత కాలంగా అనారోగ్యం
- డిసెంబర్ 31, సాయంత్రం 6 గంటలకు కన్నుమూత
"మా నాన్న మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు. అనారోగ్యంతో డిసెంబర్ 31, సాయంత్రం 6 గంటలకు ఆయన చనిపోయారు. గత 16 వారాలుగా ఆసుపత్రిలో ఉన్న ఆయన మధ్యాహ్నం కోమాలోకి వెళ్లి కన్నుమూశారు. మా కుటుంబమంతా ఇక్కడే ఉంది. మేము ఇక్కడే ఉంటున్నాము కాబట్టి, అంతిమ వీడ్కోలు కూడా ఇక్కడే పలకాలని నిర్ణయించాం. మా నాన్న మృతి విషయాన్ని తెలుసుకుని సంతాపాన్ని తెలుపుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు" అని సర్ఫరాజ్ పేర్కొన్నారు.