ఒంగోలులో ఇంటర్ విద్యార్థి సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యే అంటున్న పోలీసులు!
- రాజారెడ్డికి చదువు ఇష్టం లేదు
- రెండుసార్లు కాలేజీ నుంచి పారిపోయాడు
- తల్లిదండ్రుల ఒత్తిడితోనే ఆత్మహత్య
ఆత్మహత్యకు ముందు రాజారెడ్డి ఓ పెట్రోల్ బంకుకు వెళ్లి ప్లాస్టిక్ బాటిల్ లో పెట్రోల్ కొనుగోలు చేసినట్లు సీసీటీవీల్లో రికార్డు అయిందని పోలీసులు పేర్కొన్నారు. పెట్రోల్ కొనుగోలు చేశాక కాలేజీ వెనుకవైపు ఉన్న గేటువద్దకు చేరుకుని పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు. చదువుకోవడం ఇష్టంలేకపోయినా తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతోనే రాజారెడ్డి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ విషయంలో మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు.