ఆ బాకీ తీర్చకుంటే తెలంగాణ ప్రభుత్వంపై కోర్టుకు వెళతాం!: ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరిక
- కేంద్రం సహాయనిరాకరణ చేస్తోందని మండిపాటు
- విద్యుత్ ఉచితంగా ఏమీ రాదని చురకలు
- అమరావతిలో శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం
ఈ సందర్భంగా పునరుత్పాదక ఇంధనంపై ప్రత్యేకంగా దృష్టి సారించామని తెలిపారు. విద్యుత్ సరఫరా విషయంలో తెలంగాణ ఇంకా ఏపీకి రూ.5,000 కోట్లు చెల్లించాల్సి ఉందని వెల్లడించారు. కరెంట్ అన్నది ఫ్రీగా రాదని చురకలు అంటించారు. తెలంగాణ ఆ బాకీని తీర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకవేళ ఇందుకు తెలంగాణ ముందుకు రాకపోతే న్యాయపరంగా ముందుకు వెళతామని బాబు హెచ్చరించారు.
అలాగే సింగపూర్ కు విజయవాడ నుంచి ప్రారంభించిన విమాన సర్వీసుకు మంచి స్పందన వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ మార్గంలో మరిన్ని సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.