ఏలియన్స్ వచ్చాయంటూ మోదీకి లేఖ.. పరుగులు పెట్టిన పోలీసులు!

  • మహారాష్ట్రలోని పూణేలో ఘటన
  • ప్రధానికి ఈ-మెయిల్ పంపిన వ్యక్తి
  • కారణం తెలిసి విస్తుపోయిన పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి ఓ విచిత్రమైన లేఖ వచ్చింది. తన ఇంటి వద్ద గ్రహాంతరవాసుల (ఏలియన్స్)కు చెందిన ఓ వస్తువు ఎగురుతూ కనిపించిందని పూణేకు చెందిన ఓ వ్యక్తి(47) తెలిపాడు. భూమిపైకి వచ్చిన ఈ వస్తువు ఇక్కడి కీలక సమాచారాన్ని తమ గ్రహాలకు పంపిందని వెల్లడించాడు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ ఓ లేఖను ఈ-మెయిల్ చేశాడు.

అయితే ఈ లేఖను గమనించిన అధికారులు వెంటనే మహారాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సదరు వ్యక్తి ఇంటి వద్దకు చేరుకున్న పోలీసులకు షాక్ తగిలింది. ఎందుకంటే సదరు వ్యక్తి లేఖ పంపినట్లు అతని కుటుంబ సభ్యులకే తెలియదట.

ఈ సందర్భంగా అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. కొన్నేళ్ల క్రితం ఈ వ్యక్తి తలకు బలమైన గాయం కావడంతో లోపల రక్తస్రావం జరిగిందని తెలిపారు. అప్పటి నుంచి ఇలాగే పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని వెల్లడించారు. దీంతో ఉరుకులు, పరుగుల మీద వచ్చిన అధికారులు మెల్లగా వెనక్కు మళ్లారు.
Go Back to Shorts
aliens
Maharashtra
Narendra Modi
e mail
letter
Police
India

More Telugu News