ఉమ్మడి హైకోర్టు విభజన సెగలు.. ఆందోళనకు దిగిన ఆంధ్రా లాయర్లు!
- కొత్త హైకోర్టు భనవం పూర్తికాలేదని వ్యాఖ్య
- దానికి ఇంకో 6 నెలలు పడుతుందని వెల్లడి
- కటాఫ్ తేదీని పొడిగించాలని డిమాండ్
ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. అమరావతిలో కడుతున్న తాత్కాలిక హైకోర్టుకు ఇప్పటివరకూ వెళ్లడానికి దారి కూడా లేదని సీనియర్ న్యాయవాది ఒకరు తెలిపారు. ఈ హైకోర్టు నిర్మాణం పూర్తి కావాలంటే మరో 6 నెలలు పడుతుందని స్పష్టం చేశారు. ఏపీ న్యాయవాదుల తరలింపు కటాఫ్ తేదీని పొడిగించాలని డిమాండ్ చేశారు. కేవలం నాలుగు రోజుల్లో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు అందరూ విజయవాడకు ఎలా వెళ్లగలరని ప్రశ్నించారు. మరోవైపు హైకోర్టు విభజనపై కేంద్రం ఉత్తర్వులను తెలంగాణ న్యాయవాదులు స్వాగతించారు.