పెండింగులో ఉన్న సినిమాపై విక్రమ్ దృష్టి!
- 'కదరం కొండన్' పూర్తి చేసిన విక్రమ్
- 'ధృవ నచ్చత్తిరమ్'పై దృష్టి
- జనవరిలో చివరి షెడ్యూల్
ఇంకొక్క షెడ్యూల్ షూటింగ్ చేస్తే ఈ సినిమా కూడా పూర్తవుతుందట. అందువలన ఈ సినిమాను కూడా పూర్తిచేయడానికి విక్రమ్ రంగంలోకి దిగారని అంటున్నారు. చివరి షెడ్యూల్ ను జనవరి 2వ వారంలో ఆరంభించి, 14 రోజులపాటు ఏకధాటిగా షూటింగ్ జరపనున్నట్టుగా తెలుస్తోంది. హారిస్ జైరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాలో, విక్రమ్ సరసన రీతూ వర్మ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.