'అసురన్'గా ధనుశ్ .. కొత్త పోస్టర్ రిలీజ్
- నిన్ననే విడుదలైన 'మారి 2'
- ఈ రోజున వదిలిన 'అసురన్' పోస్టర్
- దర్శకుడిగా వెట్రిమారన్
ధనుశ్ తదుపరి చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నాడు. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ధనుశ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందువలన ఈ ఇద్దరూ కలిసి మరోమారు సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాకి 'అసురన్' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. వి.క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు.