మైదానంలో కోహ్లీ ప్రవర్తన చెత్తగా ఉంది.. అతని నైపుణ్యం మరుగున పడుతోంది!: నసీరుద్దీన్ షా
- కోహ్లీ అత్యుత్తమ ఆటగాడిలా వ్యవహరించడం లేదు
- దేశం విడిచిపెట్టిపోవాలని తను నన్ను కోరవచ్చు
- ఫేస్ బుక్ లో స్పందించిన బాలీవుడ్ నటుడు
ఏదేమైనా, భారత్ ను విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. గతంలో కోహ్లీ ఆటతీరు తనకు నచ్చదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టిన సంగతి తెలిసిందే. కోహ్లీ కంటే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెటర్ల ఆటతీరు బాగుంటుందని కామెంట్ చేశాడు. దీనిపై తీవ్రంగా స్పందించిన కోహ్లీ, అయితే భారత్ ను విడిచిపెట్టి, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కు వెళ్లాలని సదరు నెటిజన్ పై మండిపడ్డాడు. తాజాగా ఆ ఘటనను గుర్తుచేసిన నసీరుద్దీన్ షా కోహ్లీని పరోక్షంగా దెప్పిపొడిచారు.