నేనేమీ ఇంకా గర్భం దాల్చలేదు: అనుష్క శర్మ
- గత సంవత్సరంలో విరాట్, అనుష్కల వివాహం
- అనుష్క గర్భం దాల్చిందని వార్తలు
- అవన్నీ పుకార్లేనని స్పష్టం చేసిన అనుష్క
తాను యుక్త వయసులోనే పెళ్లి చేసుకున్నానని, గర్భం వస్తే దాచిపెట్టే అవకాశం ఉండదని చెప్పింది. ఎవరో కొందరు పుకార్లు పుట్టించి, ఆపై అది అబద్ధమని తెలుసుకుని, మరో జంట వెనుక పడుతుంటారని అనుష్క వ్యాఖ్యానించింది. కాగా, అనుష్క, షారూక్ జంటగా నటించిన 'జీరో' త్వరలో విడుదలకు సిద్ధంకాగా, ఆ సినిమా ప్రమోషన్ లో ఇప్పుడామె బిజీగా ఉండగా, విరాట్ ఆస్ట్రేలియాలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం వెళ్లాడన్న సంగతి తెలిసిందే.